Nabha Natesh | చివరగా నితిన్‌తో కలిసి మ్యాస్ట్రో సినిమాలో మెరిసింది ఇస్మార్ట్ భామ నభా నటేశ్ (Nabha Natesh) . ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోయింది. ప్రస్తుతం బలగం యాక్టర్ ప్రియదర్శితో కలిసి ‘డార్లింగ్’ (Darling) చిత్రంలో నటిస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ అశ్విన్ రామ్ ఈ సినిమాకుదర్శకత్వం వహిస్తు్న్నాడు. హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది నభానటేశ్. తక్కువ టైంలోనే డార్లింగ్ సెట్స్‌ను వదిలి వెళ్లడం బాధగా ఉంది. సినిమా షూటింగ్ చాలా సులభంగా పూర్తయ్యేలా నాకు సహకరించిన ప్రతీ ప్రొడక్షన్ టీం మెంబర్‌కు ధన్యవాదాలు.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది నభా నటేశ్.
ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘుబాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్మెంట్ గ్లింప్స్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత భార్య చేతిలో కీలు బొమ్మగా మారిన భర్తల స్టోరీగా ఈ సినిమా రానున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
డార్లింగ్ గ్లింప్స్..