ప్రస్తుతం రుక్మిణీ వసంత్‌కి మహర్దశ నడుస్తున్నది. పానిండియా బ్లాక్‌బస్టర్ ‘కాంతార 2’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది ఈ కన్నడ కస్తూరి. ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌నీల్’ చిత్రంలో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్నది. తాజా సమాచారం ప్రకారం ఈ అందాలభామకు మరో అద్భుతమైన అవకాశం వరించిందని ఇన్సైడ్ టాక్. వివరాల్లోకెళ్తే.. మహాగాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కించేందుకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సన్నాహాలు చేసుకుంటున్న విషయం విదితమే.
ఇందులో సుబ్బులక్ష్మి పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నదని వార్తలు కూడా వచ్చాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి స్థానాన్ని రుక్మిణీవసంత్ రీప్లేస్ చేసిందట. సూపర్స్టార్డమ్ ఉన్న సాయిపల్లవి కంటే, ఎలాంటి ఇమేజ్ లేని రుక్మిణీ వసంత్ అయితే.. ఆ పాత్రకు సరైన న్యాయం జరుగుతుందని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి భావించారట. అందుకే.. ఆ పాత్ర కోసం ఇటీవలే రుక్మిణీ వసంత్‌ని ఆయన కలిసినట్టు తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారికంగా క్లారిటీ ఇంకా రావాల్సివుంది.