Bhartha Mahasayulaku Wignyapthi | రవితేజ ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం RT76. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, ఖిలాడి ఫేం డింపుల్ హయతి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీకి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సరికొత్త టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.
భక్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇవాళ 10 : 30 నిమిషాలకు స్వామి వారి కళ్యాణం. అనంతరం ప్రసాద వితర జరుగుతుందంటూ.. పంతులు వాయిస్ ఓవర్‌తో సాగే మాటలతో షురూ అయింది గ్లింప్స్. అనంతరం ఈ అనౌన్స్మెంట్ మనలో చాలా మంది చాలా సార్లు వినుంటాం. ఇప్పుడు నాకిది ఎందుకు గుర్తొచ్చిందంటే నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, జెమినీ, చాట్ జీపీటీ ఇలా అన్నింటిని అడిగాను. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా అయోమయానికి గురిచేశాయి అంటూ రవితేజ వాయస్ ఓవర్‌తో సాగుతున్న వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పక్కా ఫ్యామిలీ టచ్‌తో రవితేజ సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది.
It’s #BharthaMahasayulakuWignyapthi 🙏🏻🙏🏻🙏🏻https://t.co/IdqIdLKhdg#BMW in Cinemas Sankranthi 2026! pic.twitter.com/vMMUnIPhxW
— Ravi Teja (@RaviTeja_offl) November 10, 2025
Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
Govinda | గోవిందా భార్య సంచలన వ్యాఖ్యలు .. ఇంకో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు ..
Suma | పాడ్‌కాస్ట్‌లో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సుమ.. కలిసి కనిపించిన విడిపోలేదా అనే వారు