న్యూఢిల్లీ: దర్శకధీరుడు రాజమౌళి సారధ్యంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. 95వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో చోటుదక్కించుకున్నది. పది విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాల జాబితాను అకాడమీ గురువారం ప్రకటించింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాటకు స్థానం దక్కింది. దీంతోపాటు మరో భారతీయ సినిమా ‘ది లాస్ట్ ఫిల్మ్ షో’ (చెల్లో షో) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చోటు సంపాదించింది.
వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైనింగ్ విభాగాల్లో కూడా RRR షార్ట్‌లిస్ట్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే మన దేశానికి చెందిన ఏ సినిమాకు ఇందులో చాన్స్ దక్కలేదు. కాగా, ఆస్కార్‌కు పోటీపడుతున్న మొత్తం 81 ట్యూన్స్ నుంచి 15 పాటలను షార్ట్ లిస్ట్ చేశారు. వాటిలో నాటు నాటుతోపాటు అవతార్-2లోని నథింగ్ ఈ లాస్ట్, బ్లాక్ పాంథర్‌లోని లిఫ్ట్ మీ అప్, టాప్ గన్ సినిమాలోని హోల్డ్ మై హాండ్ వంటి పాటలు ఉన్నాయి. ఈ 15 సినిమాల్లో ఐదు మూవీస్‌ను జనవరిలో ఆస్కార్‌కు నామినేట్ చేస్తారు. ఆ సిని మాలు మాత్రమే ఆస్కార్‌కు పోటీపడతాయి. మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు.