Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో ఈ వారం నామినేషన్స్ ఏకంగా హౌస్‌ను రణరంగంగా మార్చేశాయి. సోమవారం జరిగిన నామినేషన్స్‌లో రెండు రౌండ్ల విధానం పాటించడంతో సభ్యుల మధ్య ఘాటైన మాటల యుద్ధం, ఆరోపణలు, ఎదురు దాడులు చోటుచేసుకున్నాయి. మొదటి రౌండ్ నామినేషన్స్‌లో భరణికి 2 ఓట్లు, పవన్‌కు 2 ఓట్లు, సుమన్, తనూజ, కళ్యాణ్, సంజనలకు ఒక్కో ఓటు వచ్చాయి. పెద్దగా రచ్చ లేకుండానే మొదటి రౌండ్ ముగిసింది. రెండో రౌండ్లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హౌస్ సభ్యులు మొదటి రౌండ్లో నామినేట్ చేయని ఇంకొకరిని నామినేట్ చేయాల్సి రావడంతో వాదనలు చెలరేగాయి. దివ్య “మంచిదే కానీ నోరు కంట్రోల్లో ఉండదు” అంటూ భరణి చేసిన వ్యాఖ్యలు ఆమెను ఆగ్రహానికి గురి చేశాయి.
దివ్య వెంటనే కౌంటర్ ఇస్తూ..మీలా సాఫ్ట్‌గా డీల్ చేయను. అవసరం వస్తే వాయిస్ రైజ్ చేస్తాను అని స్పష్టం చేసింది. ఇక తనూజ కెప్టెన్సీ విలువ గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించిందని ఇమ్ము అసంతృప్తి వ్యక్తం చేశాడు.దీనికి తనూజ కూడా ఘాటుగానే స్పందిస్తూ..కరెక్ట్ పాయింట్ ఉంటేనే నామినేట్ చేయి. నీ ఇష్టం వచ్చినట్టు చేయకు అని తిప్పికొట్టింది. అనంతరం పవన్ ఇమ్మూ పేరును నామినేషన్స్‌లో వేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రెబల్ టాస్క్‌లో ఇమ్మూ తన పేరును చెప్పిన విషయం ప్రస్తావిస్తూ పవన్ భావోద్వేగానికి లోనయ్యాడు.మధ్యలో కళ్యాణ్ రావడంతో హౌజ్ హీటెక్కింది. కళ్యాణ్ ఆరోపిస్తూ .. పవన్ తన గేమ్ తానే ఆడడంలేదు… రీతూ కోసమే ఆడుతున్నాడు” అని కామెంట్ చేయడంతో రీతూ కూడా వాగ్వాదంలోకి దిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రచ్చ మధ్య సంజన చేసిన ఒక వ్యాఖ్య హౌస్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. రీతూ రాత్రిళ్లు పవన్‌తో అంటుకు కూర్చుంటుంది అని వ్యాఖ్యానించడంతో రీతూ షాక్‌కు గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఇమ్మాన్యుయేల్, తనూజ, ఇతరులు వెంటనే జోక్యం చేసుకుని సంజనపై సీరియస్ అయ్యారు. ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడకండి” అంటూ వారించారు.ఇక ఈ వారం నామినేషన్లో ఉన్నది ఎవరంటే.. దివ్య, పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన, భరణి, సుమన్, తనూజ ఉన్నారు. ఈ వారం హౌస్‌లో జరిగిన నామినేషన్ రచ్చ ప్రేక్షకులకు మంచి మసాలా అందించినట్టుగా చెప్పొచ్చు.