Rebel Saab Song | ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా “ది రాజా సాబ్” పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది “కల్కి”తో వరల్డ్‌వైడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఈసారి ఎలాంటి మాస్ ఫైర్ చూపిస్తాడో అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి రిలీజ్‌గా ఈ సినిమా సిద్ధమవుతుండటంతో హైప్ మరింత పెరిగింది. ఇదిలా ఉండగా, చిత్రబృందం నుంచి వచ్చిన తొలి పాట “Rebel Saab” నవంబర్ 23, 2025న విడుదలైంది. కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ, ఆన్లైన్లో పాటకు మంచి స్పందన లభించింది. టాప్ రికార్డులను బద్దలు కొట్టకపోయినా,ఈ పాటకు వచ్చిన వ్యూస్, లైక్స్ మాత్రం ఆకట్టుకునే స్థాయిలో ఉన్నాయి.
విడుదలైన తొలి 24 గంటల్లో ఈ పాటకు దాదాపు 14.92 మిలియన్ వ్యూస్, 335.4K లైక్స్ వచ్చాయి. ఇది పెద్ద రికార్డ్ కాకపోయినా, ఆలస్యంగా వచ్చిన పాటకు ఇవి గుడ్ నెంబర్స్‌గా పరిగణిస్తున్నారు. ప్రభాస్ తాజాగా చేసిన సినిమాలతో పోలిస్తే, ఈ పాటలో ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా, పాట యూట్యూబ్‌లో విడుదలైన తర్వాత కేవలం 23 నిమిషాల్లో 100K లైక్స్ చేరుకోవడం పాటకు వచ్చిన వేగవంతమైన రెస్పాన్స్‌ను సూచిస్తోంది. ఇది ప్రభాస్ క్రేజ్‌కి నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పాట విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీనింగ్‌కు భారీగా అభిమానులు హాజరై మాస్ సెలబ్రేషన్స్ చేశారు.
థియేటర్ స్క్రీన్‌పై ప్రభాస్ మాస్ అవతారాన్ని చూడడం వారికి ప్రత్యేక అనుభూతినిచ్చింది. “Rebel Saab” పాట విజువల్స్‌లో ప్రభాస్ ఎనర్జీ, స్టైల్, మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తానికి, తొలి పాట రికార్డులు సృష్టించకపోయినా, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో “ది రాజా సాబ్”పై అంచనాలు మరింతగా పెరిగాయి. త్వరలో రానున్న ట్రైలర్, మిగతా పాటలు ఎలా ఉండబోతున్నాయి, సంక్రాంతి సీజన్లో ఈ సినిమా ఎంతటి మాస్ స్టార్మ్ సృష్టించబోతుందో అనే ఆసక్తి పెరుగుతోంది. ఇక రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నుండి ఫౌజీ, సలార్ 2, కల్కి 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.