IBPS Clerk Mains: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ ఉద్యోగాల భర్తీకి (Clerk recruitment) ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి, ఫలితాలను కూడా విడుదల చేసింది. ఇక మెయిన్స్ ఎగ్జామ్‌ను నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన అడ్మికార్డులు (Admit Cards) లేదా కాల్ లెటర్‌ను ఐబీపీఎస్ విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు డిసెంబర్ 2 వరకు అధికారిక వెబ్సైట్ ibps.in.లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్స్‌లో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూలకు ఆహ్వానించనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 10,277 పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 4671 పోస్టులు, ఓబీసీలకు 2271, ఈడబ్ల్యూఎస్ 972, ఎస్సీ 1550, ఎస్టీ 813 చొప్పున పోస్టులు ఉన్నాయి.