Team India : సుదీర్ఘ ఫార్మాట్లో ఒకప్పుడు భారత్ నంబర్ 1 జట్టు. రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ ఆడింది కూడా. గత కొంత కాలంగా టెస్టుల్లో మేటి జట్టుగా ఎదిగిన టీమిండియా ఇప్పుడు సంక్షోభంలో పడింది. స్వదేశంలో రికార్డు సిరీస్ విజయాలతో చరిత్ర సృష్టించిన మన టీమ్ ఇటీవల.. ఓటములతో అందోళనకు గురి చేస్తోంది. కోల్‌కతా టెస్టు(Kolkata Test)లో అనూహ్యంగా పరాజయం పాలైన భారత్.. గువాహటిలోనూ పసలేని బౌలింగ్, బ్యాటర్ల వైఫల్యంతో భారీ మూల్యం చెల్లించుకునేలా ఉంది. ఈ పరిస్థితుల్లో నెట్టింట రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వీడియోలు వైరలవుతున్నాయి. అతడిలాంటి జిడ్డు ప్లేయర్ ఇప్పుడు టీమిండియాకు అనివార్యమని అందరూ అంటున్నారు.
టెస్టు క్రికెట్లో భారత జట్టు చరిత్రాత్మక విజయాలు సాధించింది. విదేశాల్లో.. స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి పెద్ద జట్లను కంగుతినిపించింది. కానీ, అవన్నీ గతం. ఇప్పుడు ఏంటీ? అనేదే ముఖ్యం. కోచ్ గౌతం గంభీర్ వచ్చాక టెస్టుల్లో మన జట్టు ఆట మరింత తీసి కట్టుగా మారింది. సీనియర్లు అశ్విన్(Ashwin), రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఒకరితర్వాత ఒకరి వీడ్కోలు కూడా పెద్ద ప్రభావమే చూపింది. టీ20 ఆటకు అలవాటు పడిన కుర్రాళ్లు అవకాశాల్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఫలితంగా ఒకప్పుడు స్వదేశంలో పెద్ద పులిలా గర్జించిన టీమిండియా ఇప్పుడు ప్రత్యర్థులకు తలవంచుతోంది.
India have now lost four of their last six home Tests. They had lost only three home Tests in the entire 10-year stretch from January 2013 to December 2023. #INDvSA #Cricket pic.twitter.com/V1dGB9fwhF
— Soft Spoken🔻 (@softspoken04) November 24, 2025
వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో కూడిన టీమ్.. ఒక రోజు మొత్తం క్రీజునంటుకోలేకపోతోంది. అందుకే.. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్.. ఇప్పడు డబ్ల్యూటీసీ ఛాంపియన్ దక్షిణాఫ్రికా ధాటికి క్లీన్‌స్వీప్ తప్పేలా లేదు. మరి.. భారత్ మళ్లీ పుంజుకోవాలన్నా.. పరువు కాపాడుకోవాలన్నా వికెట్ల పతనాన్ని అడ్డుకొనే మరొక రాహుల్ ద్రవిడ్ కావాలి. అతడిలా జిడ్డు ఆటతో బంతిని పాతబడేలా చేసి.. ఆ తర్వాత వచ్చేవాళ్లకు బ్యాటింగ్ సులభంఘా చేయగల నయావాల్ ఇప్పుడు అత్యవసరం.
Today, when debates rage about pitches vs batting temperament…
Can a modern-day batter still play a spell like Rahul Dravid does here?
Forty straight dots. No panic.
Just pure old school defence.A different era. A different mindset. pic.twitter.com/gEYgiWHGK4
— Annurag P Rekhi (@Dravidict) November 23, 2025
ప్రపంచంలోనే నిఖార్సైన టెస్టు బ్యాటర్ రాహుల్ ద్రవిడ్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో మేటి పేసర్లను సైతం దీటుగా ఎదుర్కొన్న ధీశాలి అతడు. బలమైన డిఫెన్స్, ఫుట్‌వర్క్, చెక్కుచెదరని ఏకాగ్రత.. కలగలిపిన ద్రవిడ్ 1990వ దశకం నుంచి టీమిండియా చరిత్రాత్మక విజయాల్లో కీలకమయ్యాడు. ‘ది వాల్’, ‘టెస్టు స్పెషలిస్ట్’గా భారత జట్టుపై చెరగని ముద్ర వేసిన ద్రవిడ్ వారసత్వాన్ని ఛతేశ్వర్ పూజార (Chateshwar Pujara) కొనసాగించాడు. అచ్చం ద్రవిడ్ ఆటతో అలరించిన ఈ సౌరాష్ట్ర కెరటం మూడో స్థానంలో పాతుకుపోయి ‘నయా వాల్’ అనే పేరు సంపాదించాడు.
There it is, a brilliant ton for Cheteshwar Pujara from 231 balls!
That’s his 16th hundred in Test cricket and third against Australia.#AUSvIND | @Domaincomau pic.twitter.com/cD1rSObzGq
— cricket.com.au (@cricketcomau) December 6, 2018
అయితే.. రెండేళ్ల క్రితం ఓవల్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఈ స్టార్ ప్లేయర్ తీవ్రంగా నిరాశపరిచాడు. అంతకుముందు ఇంగ్లండ్ గడ్డపై కౌంటీల్లో చెలరేగి ఆడిన పుజ్జీ.. ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకొని వికెట్ల పతనాన్ని అడ్డుకోలేకపోయాడు. అంతే.. అక్కడితో పుజార కెరీర్ ముగిసింది. అతడి తర్వాత మూడో స్థానంలో ఆడిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఫర్వాలేదనిపించాడు.
మొత్తంగా 11 టెస్టుల్లో రెండు సెంచరీలతో కలిపి 38.62 సగటుతో 618 రన్స్ చేశాడతడు. దాంతో.. మరో వాల్ దొరికినట్టే అనకున్నారు అభిమానులు. కానీ.. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్తో గిల్ జట్టు కోసం నాలుగో స్థానంలో ఆడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ పర్యటనతో కెప్టెన్సీ చేపట్టిన అతడు.. బ్యాటుతో అదరగొట్టి కోహ్లీ లెక్కనే తాను నాలుగుకు సరిపోతానని చాటుకున్నాడు. ఫలితంగా మళ్లీ మూడో సమస్య మొదటికొచ్చింది.
Overall, Virat Kohli finished as fourth-highest run-getter for India in Tests, scoring 9230 runs from 123 Tests at an average of 46.85, hitting 30 hundreds and 31 fifties, bringing the curtains down on a glorious career. 🫡 🙌#TeamIndia | #ViratKohli | @imVkohli pic.twitter.com/vTJiKnBYvG
— BCCI (@BCCI) May 12, 2025
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కరుణ్ నాయర్ దారుణంగా విఫలమవ్వగా.. కుర్రాడు సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. దాంతో.. అతడినే వెస్టిండీస్ సిరీస్‌లో ఆడించారు. ఏమైందో తెలియదు.. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు అతడి బదులు వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించారు. వాషీ పెద్ద స్కోర్ చేయకపోవడంతో విమర్శలురాగా.. మళ్లీ సాయినే గువాహటి టెస్టులో నంబర్ 3గా పంపారు. కీలకమైన ఈ స్థానంలో ఆడేందుకు మానసికంగా సిద్ధమవుతున్న సాయికి మరిన్ని అవకాశాలు ఇస్తే అతడు మరో వాల్ అవుతాడని మాజీలు అభిప్రాయ పడుతున్నారు.
Sai Sudharsan in Tests:
⚡Matches: 6
⚡Innings: 10
⚡Runs: 288
⚡Average: 28.8
⚡50s/100s: 2/0What have you made of his Test career so far? 🤔#IndianCricket #CricketTwitter #saisudharsan pic.twitter.com/U5lt60JIpk
— Cricbuzz (@cricbuzz) November 24, 2025
రంజీల్లో సెంచరీల మోత మోగించే అభిమన్యు ఈశ్వరన్.. దేవ్‌దత్ పడిక్కల్ సైతం మూడుకు పక్కాగా సరిపోతారు. కానీ వీళ్లకు అవకాశాలు రావడం లేదు. ప్రయోగాల పేరుతో ఇప్పటికే చాలామందిని పరీక్షించిన గౌతీ.. ఇకనైనా కుర్రాళ్లకు భరోసానివ్వాలి. అప్పుడే వాళ్లు అభద్రతాభావం లేకుండా స్వేచ్ఛగా ఆడుతారు. ఇప్పటికైనా ఈ సత్యాన్ని కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గ్రహిస్తే భారత టెస్టు జట్టుకు పూర్వవైభవం ఏమంత కష్టంకాదు..!