Devi Sri Prasad | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మ్యూజిక్ కంపోజర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad). ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్‌తోపాటు పలు ప్రధాన భాషల లీడింగ్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ కంపోజర్ ప్రధాని నరేంద్రమోదీ ( PM Narendra Modi) తో ప్రత్యక్షమైన స్టిల్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ డీఎస్పీ, మోదీని ఎక్కడ కలిశారనే కదా మీ డౌటు. న్యూయార్క్‌లో జరిగిన ఓ కల్చరల్ ఈవెంట్ (New York cultural event)కు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్లో ఈ ఇద్దరు ఇలా ఒక్కచోట కలిసిపోయారు. ఈవెంట్లో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత స్టేజ్‌పైకి వచ్చిన మోదీ డీఎస్పీని ఆత్మీయంగా హగ్ చేసుకుని.. అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ, మోదీ చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఖాతాలో నాగచైతన్య నటిస్తోన్న తండేల్, సూర్య టైటిల్ రోల్ పోషిస్తున్న కంగువ, ధనుష్ నటిస్తోన్న కుబేర సినిమాలున్నాయి.
#NarendraModi #DeviSriPrasad pic.twitter.com/VkV241tSbI
— Nikil Murukan (@onlynikil) September 23, 2024
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి