R N R Manohar | కోలీవుడ్‌లో విషాదం..ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత
ప్రముఖ తమిళ (kollywood) నటుడు, దర్శకుడు ఆర్.ఎన్.ఆర్ మనోహర్ (R N R Manohar) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మనోహర్ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

తమిళ ఇండస్ట్రీ (kollywood)లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.ఎన్.ఆర్ మనోహర్ (R N R Manohar) కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మనోహర్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి మనోహర్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. అందుకే మనోహర్ సినిమాలకు కూడా దూరంగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం కన్నుమూశారు.
మనోహర్ మరణవార్త తెలియగానే తమిళ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కోలీవుడ్‌లో మనోహర్‌కు దర్శకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు ఉంది. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ (KS Ravikumar) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా మనోహర్ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత రచయిత, నటుడు, దర్శకుడిగా మారారు.
రచయితగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ‘కొలంగళ్’, ‘తెన్నవన్’, ‘పున్నాగై పూవే’ లాంటి చిత్రాలకు మాటలు రాశారు. ‘మాసిలమని’ సినిమాతో దర్శకుడిగా మారారు మనోహర్. ‘కొలంగళ్’, ‘తెన్నవన్’, ‘వీరం’, ‘వేదాలం’, ‘మిరుథన్’, ‘ఖైదీ’, ‘విశ్వాసం’, ‘టెడ్డీ’ తదితర తమిళ సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు మనోహర్. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’తో తెలుగు ప్రేక్షకుల్ని నేరుగా పలకరించారు ఈయన.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Lavanya Tripathi Gossip | లావణ్య త్రిపాఠిపై సర్ప్రైజ్ గాసిప్ హల్చల్
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

