‘మొగిలిరేకులు’ఫేం సాగర్ హీరోగా ఓ విభిన్న కథాచిత్రం తెరకెక్కనున్నది. సింగరేణి కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించనున్నట్టు శనివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు. ‘జార్జి రెడ్డి’ ఫేం జీవన్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.
తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని, సింగరేణి కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు, అనుబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించనున్నామని, పానిండియా స్థాయిలో ప్రేక్షకులందరూ ఓ కొత్త అనుభూతికి లోనయ్యేలా ఈ సినిమా కథాంశం ఉంటుందని, మైనింగ్ ప్రాంతాల్లోని కఠినమైన వాతావరణం, కార్మికుల దినచర్యలు, వారి త్యాగాలు ఈ కథలో ప్రధానంగా ఉంటాయని, ఈ సినిమాలో సాగర్‌తోపాటు మరో ప్రముఖ హీరో కూడా నటిస్తారని దర్శకుడు తెలిపారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.