Suriya 45 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో నటిస్తోన్న సూర్య 45. ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రానికి పెట్టైక్కరన్ (Pettaikkaran) టైటిల్‌ను ఫైనల్ చేశారని, దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని కోలీవుడ్ సర్కిల్ సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఆర్జే బాలాజీ టీం నుంచి అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి.
ఈ చిత్రంలో ఆర్జే బాలాజీనెగెటివ్ రోల్లో కనిపించనున్నాడట. ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. స్క్రిప్ట్‌లోని కోర్ పాయింట్‌పై ప్రభావం పడకుండా సూర్య సార్ కోసం చాలా మార్పులు చేశామని.. సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశామని ఇప్పటికే ఆర్జే బాలాజీ క్లారిటీ ఇచ్చాడని తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ప్రీ లుక్ స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
సూర్య మరోవైపు స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 (Suriya 44)లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రెట్రో టైటిల్‌ను ఫిక్స్ చేశారు.రెట్రో టైటిల్ టీజర్ (RETRO Title Teaser) ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది.