Rishab Shetty | కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) ఫుల్ జోష్‌మీదున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 (Kantara: Chapter 1) చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.509 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సినిమా సక్సెస్న్ రిషబ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి తాజాగా ముంబై (Mumbai)లోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం నటుడికి ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఇక దర్శనం అనంతరం బయటకు వచ్చిన రిషబ్ శెట్టి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార చాఫ్టర్ 1 వచ్చిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును అందుకుంది. విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.509 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. మరోవైపు ఈ వీకెండ్ కూడా థియేటర్లలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో కాంతార మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
Also Read..
Kantara Chapter 1 | రూ.500 కోట్ల క్లబ్లో ‘కాంతార చాఫ్టర్ 1’.. బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత
Pongal Race | 2026 సంక్రాంతి పోటీ హీరోలకే కాదు… హీరోయిన్స్ మధ్య సమరం తారాస్థాయిలోనే!
Kishkindhapuri | హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’.. ఓటీటీ, టెలివిజన్ రిలీజ్ డేట్ ఇదే!