Janhvi Kapoor | దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ – నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. అనంత్.. రాధికా మర్చంట్‌ను ఈ ఏడాది జులైలో వివాహం చేసుకోబోతున్నాడు. దీంతో అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ వేడుకలను షురూ చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్ (Jamnagar)లో మూడు రోజులపాటు ఈ వేడులకు శ్రీకారం చుట్టింది. ఈ ముందస్తు వివాహ వేడుకలు శుక్రవారం సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలకు చెందిన ప్రముఖలను ఈ వేడుకకు ఆహ్వానించి గతంలో కనీవినీ ఎరుగని విధంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ తారాగణం మొత్తం కదిలి వెళ్లింది. పలువురు స్టార్ క్రికెటర్లు కూడా సందడి చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి రామ్‌చరణ్ దంపతులు కూడా వెళ్లారు. ఈ వేడుకల్లో వరల్డ్ పాప్ సింగర్ రిహాన్నా (Rihanna) తన ట్యాలెంట్‌తో పార్టీకే కిక్కెకించింది. చార్ట్‌బస్టర్‌లో టాప్ సాంగ్స్‌ను పాడి.. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో ఊపు తెచ్చింది. బాడీ హగ్గింగ్ ఎల్లో ఔట్ఫిట్ డ్రెస్సులో .. రిహాన్నా స్పెషల్‌గా థ్రిల్ పుట్టించింది. ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చిన అతిథులు రిహాన్నా సాంగ్స్‌కు స్టెప్పులేస్తూ మైమరిచిపోయారు.
రిహాన్నా ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో కూడా కాలుకదిపింది. ఇక బీటౌన్ భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) రిహాన్నాతో కలిసి చిందేసింది. ఇద్దరూ హాట్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను జాన్వీ కపూర్ తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రిహాన్నా షో కోసం జామ్‌నగర్‌లో ప్రత్యేక సెట్‌ను వేశారు. తన ట్రూప్‌తో కలిసి రిహాన్నా .. పాప్ సాంగ్స్‌ను పాడింది. రిహాన్నా టీమ్ చేసిన పర్ఫార్మెన్స్కు అతిథులు స్టన్ అయ్యారు. రిహాన్నా సాంగ్ పాడుతున్న సమయంలో.. వేడుకకు వచ్చిన అతిథులు కూడా తన్మయత్వంతో చిందేశారు.
అమెరికన్ పాప్ సింగర్ అయిన రిహాన్నాకు ఒక రోజు ఈవెంట్‌కు అంబానీ కుటుంబం భారీగానే ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. ఈ పర్ఫార్మెన్స్ కోసం సుమారు రూ.75 కోట్ల వరకూ రెమ్యూనరేషన్‌గా ఇచ్చినట్లు టాక్. అయితే రిహాన్నా టీమ్‌లో బ్యాక్‌గ్రౌండ్ సింగర్స్, డ్యాన్సర్లు కూడా ఉన్నారు.
ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు బీటౌన్ నుంచి షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, శ్రద్ధా కపూర్, అక్షయ్ కుమార్, సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, జాన్వీ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అనిల్ కపూర్, బోనీ కపూర్, మాధురీ దీక్షిత్, సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, సారా అలీఖాన్, అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్, క్రికెటర్లు సచిన్, ధోనీ, ఇషాన్, పాండ్య, బౌల్ట్, బ్రావో, టిమ్ డేవిడ్ సహా పలువురు పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేస్తున్నారు.
Also Read..
Anant Ambani | అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్.. బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల సందడి
Isha Ambani | సోదరుడి ముందస్తు వివాహ వేడుకల్లో మెరిసిన ఈషా అంబానీ.. ఆఫ్ షోల్డర్ గౌనులో