Shilpa-Raj Rift | బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి తన భర్త రాజ్‌కుంద్రాతో విడిపోనుందా.. తన పిల్లలతో కలిసి విడిగా జీవించనున్నదా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. అశ్లీల చిత్రాలను నిర్మిస్తూ యాప్‌లో విడుదల చేస్తున్నారన్న అభియోగంపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గత నెల 19న రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రా బెయిల్ కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. అశ్లీల చిత్రాల కేసు శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వివాదం నేపథ్యంలో రాజ్‌కుంద్రా మనీని కూడా ముట్టుకోవద్దని శిల్పాశెట్టి భావిస్తున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య సమస్యలను తక్కువ చేసి చూపాల్సిందేమీ లేదని శిల్పాశెట్టి స్నేహితులొకరు చెప్పారు. రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల నిర్మాణం బయటపడటంతో శిల్పాశెట్టి షాక్‌కు గురయ్యారని కథనం. ఆయన మోసపూరితంగా, కపటత్వంతో వజ్రాలు, డ్యూప్లెక్స్ ఇండ్లు సంపాదించారన్న సంగతి ఆమెకు తెలియదని వినికిడి.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్‌కుంద్రా మనీ టచ్ చేయరాదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. తన పిల్లల సంరక్షణకు సరిపడా సంపాదిస్తున్నారు. హంగామా-2, నిక్కమ్మ తర్వాత సినిమాల్లో నటించేందుకు సిద్ధం అని పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి చెప్పారు. అనురాగ్ బసు, ప్రియదర్శన్ ఇప్పటికే తమ సినిమాల్లో శిల్పాశెట్టికి పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
శిల్పాశెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాజ్‌కుంద్రా వివాదం బయటపడినప్పటి నుంచి ఆమె నిరంతరం మోటివేషనల్ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల సూపర్ డాన్సర్ చాప్టర్-4 లో నటిస్తున్న గ్లామరస్ ఫొటోను షేర్ చేశారు. ఇండో-వెస్ట్రన్ స్టైల్లో దీన్ని డిజైన్ చేశారు.
టైటానిక్ హీరోకి, తాలిబన్లకు లింకేంటి? ఆఫ్ఘన్ బార్బర్లు ఎందుకు వణికిపోతున్నారు?
Taliban | ఇండియా మాకు ముఖ్యమైన దేశం.. వారికి ఎలాంటి ముప్పు ఉండదు : తాలిబన్లు
Fariba Akemi | తాలిబన్లు చంపేస్తారేమో.. ఇండియాలోని ఓ ఆఫ్ఘన్ మహిళ ఆవేదన ఇదీ..
టెకీలకు గుడ్‌న్యూస్ : ఇక ఏడాది పొడవునా ఐటీ కొలువులు!
మారుతి సుజుకి కార్ల ధరలకు మళ్లీ రెక్కలు!