కాబూల్: అల్‌ఖైదా మాజీ చీఫ్, 2001 డబ్ల్యూటీసీ టవర్లపై దాడి ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ సన్నిహితుడు అమినుల్ హక్ మళ్లీ ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో అడుగుపెట్టాడు. ఆ దేశం మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఈ అల్‌ఖైదా ఉగ్రవాది మళ్లీ తన సొంత ప్రావిన్స్ అయిన నంగార్హర్కి వచ్చాడు. అతన్ని వాహనంలో రావడం చూసిన అక్కడి తాలిబన్లలో కొందరు.. సెల్ఫీలు దిగడానికి ఎగబడడం విశేషం. బిన్ లాడెన్ టోరా బోరాలో ఉన్నప్పుడు అతనికి అమినుల్ హక్ సెక్యూరిటీ ఇన్చార్జ్గా ఉండేవాడు. ఆ తర్వాత 1980ల్లో లాడెన్‌కు చేరువయ్యాడు. బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు 2011లో పాకిస్థాన్‌లో అబోటాబాద్‌లో మట్టుబెట్టిన విషయం తెలిసిందే.