సినీ పరిశ్రమలో గీత రచయితలకు వున్న స్థానం చాలా ప్రత్యేకమైనది. ఓ పాట హిట్ కావాలంటే ఆ ట్యూన్‌కు తగ్గ సాహిత్యం కూడా కావాలి. ఇక ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌కు నాటునాటు చిత్రానికి ఆస్కార్డ్ అవార్డు అందుకున్న తరువాత గీత రచయితలకు తెలుగు సినీ పరిశ్రమలో మరింత గౌరవం పెరిగింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గీత రచయితలు చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రీ, కాసర్ల శ్యామ్, అనంత్ శ్రీరామ్ ఇలా వీరందరిని ఒకే వేదికపై ఒకే ఫోటోలో చూసే అరుదైన వేడుకకు రేవు పాటల ఆవిష్కరణ వేదికగా నిలిచింది.
నూతన నటీనటులతో నిర్మించిన రేవు చిత్రం పాటల క్యాసెట్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ఈ సాహితీ కారులు హాజరయ్యారు. ఈ పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌ల యుగంలో అందరూ మరిచిపోయిన క్యాసెట్లను రేవు చిత్రం యూనిట్ మరోసారి గుర్తుచేసి తమ పాటలను క్యాసెట్ రూపంలో ఆవిష్కరించారు. మత్స్య కారుల జీవన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు హరినాథ్ పులి దర్శకుడు. అయితే ఈ వేడుకకు హాజరైన ప్రముఖ గీత రచయితలందరిని ఒకే వేదికపై చూసిన వారంతా ఎంతో థ్రిల్లింగ్‌గా ఫీలయ్యారు. చూసిన వాళ్లే కాదు. మేమంతా ఒకే వేదికపై చూసుకుని ఎంతో ఆనందపడుతున్నాం.
ఇలా మేము అందరం కలిసి మాట్లాడుకోవడం మాకు కూడా ఎంతో కొత్తగా వుందని ఆనందం వ్యక్తం చేశారు ఆ ప్రముఖ గీత రచయితలు. ఈ సినిమా పాటల్లో నవ్యత, నాణ్యత రెండు కనిపించాయని చంద్రబోస్ చెప్పగా, ఈ సినిమా పాటల్లో కరుణ్, రౌద్రం వున్నాయని అనంత్ శ్రీరామ్ అన్నారు. ఈ సినిమా టీమ్‌ను చూస్తుంటే కొత్త నెత్తుటి సముద్రంను చూసినట్లుగా వుందని, అ..ఆలు అన్నీ ఇకే వేదికపై వున్నట్లుగా అనిపిస్తుందని సుద్దాల అశోక్ తేజ చెప్పారు. ఈ రేవు సినిమా బాక్సాఫీస్ మీద రేవెట్టాలని రామజోగయ్య శాస్త్రి చమత్కరించారు.
Read Also :
Chiranjeevi | పారిస్ వీధుల్లో చిరంజీవి ఫ్యామిలీ ఇలా..
Samantha | సమంత ప్రాజెక్ట్‌లో మీర్జాపూర్ యాక్టర్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?