మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 11:30:02

అశుతోష్ భార్య‌కి షాక్ ఇచ్చిన క‌రెంట్ బిల్‌..!

అశుతోష్ భార్య‌కి షాక్ ఇచ్చిన క‌రెంట్ బిల్‌..!

లాక్‌డౌన్ వ‌ల‌న మూడు నెల‌లు క‌రెంట్ బిల్స్ తీయ‌క‌పోవ‌డంతో, ఇప్పుడు శ్లాబుల‌తో క‌లిపి బిల్స్ పంపుతున్నారు. ఈ బిల్స్ జ‌నాల‌కి షాక్ ఇస్తున్నాయి. సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా ఈ ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే నటి స్నేహ భర్త ప్రసన్న,హీరోయిన్ కార్తీక, తాప్సీ, శ్రద్ధాదాస్‌లు క‌రెంట్ బిల్ విష‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్‌‌లలో విలన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అశుతోష్‌రాణా భార్య, నటి రేణుకా సహానే త‌ప్పుడు బిల్లుల‌పై మండిప‌డ్డారు.

మే 9వ తేదీన నాకు రూ. 5510 బిల్ వచ్చింది. అయితే జూన్‌లో మరో బిల్ రూ. 29700 వచ్చింది. అంటే మే మరియు జూన్‌లో వచ్చిన బిల్స్‌ని పరిశీలిస్తే.. ఒక్క మే నెలకే నాకు రూ. 18080  బిల్ వేశారు. అంతకుముందు నెల రూ. 5510 వచ్చిన బిల్, ఒక్క నెలకే రూ. 18080 ఎలా అయ్యింది? అంటూ ముంబై అదానీ ఎలక్ట్రిసిటీని ట్యాగ్ చేస్తూ మండిప‌డ్డారు రేణుకా.  ముంబై అదానీ ఎలక్ట్రిసిటీపై ఇప్ప‌టికే జ‌నాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా, ఇప్పుడు సెల‌బ్రిటీలు కూడా వారి వెంట న‌డుస్తుండ‌డంతో ఎల‌క్ట్రిసిటీ అధికారుల‌కి  ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంది. 


logo