Renu Desai | వీధి కుక్కలపై జరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రముఖ నటి రేణు దేశాయ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. రేణు చేసిన వ్యాఖ్యలను కొందరూ సమర్థిస్తుండగా.. మరికొందరూ విమర్శిస్తున్నారు. అయితే తనపై ఎన్ని విమర్శలు వచ్చిన తన పోరాటం మాత్రం ఆపనని తెలిపింది రేణు దేశాయ్. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.
కాశీలో గంగానదిలో బోటింగ్ చేస్తున్న వీడియోను పంచుకున్న రేణు.. ఈ వీడియోపై ”నన్ను ఆదుకోవడానికి అమ్మానాన్నలు లేరు, తోడుగా నిలబడే అన్నయ్య గానీ, భర్త గానీ లేరు. ప్రస్తుత విషయంలో నా తప్పేమీ లేకున్నా చాలామంది నన్ను నిందిస్తున్నారు. నన్ను విమర్శించే వారికి నేను సమాధానం చెప్పదలచుకోలేదు. నా బాధను, ఆవేదనను నేను నమ్మే ఆ దేవుడికే చెప్పుకుంటాను. నా మొరను ఆయన తప్పక వింటాడని నాకు నమ్మకం ఉంది. నేను తరచూ కాశీకి ఎందుకు వెళ్తుంటానో ఇప్పుడు మీకు అర్థమై ఉండవచ్చంటూ” రేణు దేశాయ్ రాసుకోచ్చింది.