Good Bad Ugly | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న విదాముయార్చి (Vidaa Muyarchi). ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిష(Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మరోవైపు అజిత్ కుమార్ నటిస్తోన్న యాక్షన్ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly). అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తు్న్నాడు. టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలకు సంబంధించిన క్రేజీ వార్త అజిత్ కుమార్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందట. విదాముయార్చి సినిమాకు రైట్స్ రూ.75 కోట్లు పలుకగా.. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఏకంగా రూ.95 కోట్లు వెచ్చించారట.
ఇదే నిజమైతే అజిత్ కుమార్ సినిమాలకు మార్కెట్ ఎలా ఉందో విడుదలకు ముందే చక్కర్లు కొడుతున్న తాజా ఫిగర్ క్లారిటీ ఇచ్చేస్తోంది. ఈ లెక్కన బాక్సాఫీస్ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోవడం పక్కా అయిపోయినట్టే.
[ BUZZ ] 📢
The Digital Streaming Rights For Highly Anticipated ( #VidaaMuyarchi – #GoodBadUgly ) Movies Has been Reportedly Sold To The Most Popular Platform Of NETFLIX For An Impressive Sum Of 75 Crores And 95 Crores Respectively..! 😎 💸#AjithKumar pic.twitter.com/sqT8tY3bXK
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) November 22, 2024
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు