Thalaivar 173 | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించనున్న Thalaivar 173 ప్రాజెక్ట్‌కు పాపులర్ డైరెక్టర్ సుందర్ సీ దర్శకత్వం వహించనున్నట్టు మొదట వార్తలు వచ్చాయని తెలిసిందే. అరుణాచలం కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న వార్తతో అభిమానులు, మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా తాను ఈ సినిమా చేయడం లేదని అందరూ తనను క్షమించాలని కోరుతూ సుందర్ సీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశాడు.
ఈ స్టార్ డైరెక్టర్ తలైవా సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో మాత్రం చెప్పలేదు. అయితే దీనికి సంబంధించిన కొన్ని పుకార్లు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. సరైన కథ లేకపోవడం వల్లే సుందర్ సీ ఈ మూవీ చేయలేనని ఫిక్సయ్యాడని.. ఈ వార్త జనాల్లోకి వచ్చే లోపు సుందర్ సీ తన నిర్ణయాన్ని రజినీకాంత్, కమల్ హాసన్‌తో సరైన విధంగా వివరించలేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
అయితే ఈ వార్తలను సుందర్ సీ సతీమణి, నటి ఖుష్బూ సుందర్ కొట్టిపారేసింది. జనాలు కేవలం ఒక గాసిప్ ఆధారంగా ఒక విషయాన్ని నమ్ముతారో చూసి ఆశ్చర్యపోతున్నానని చెప్పింది. అంటే ఈ లెక్కన సుందర్ సీ తలైవా సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం కథ కాదని అర్థమవుతుంది. మరి కారణం ఏంటనే దానిపై రజినీకాంత్ కానీ కమల్ హాసన్ కానీ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
And you tweet and raise questions on hearsay?? What a disaster you are. https://t.co/qpdI4oAMMi
— KhushbuSundar (@khushsundar) November 14, 2025
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
Bala Krishna | అఖండ 2 టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో బాలయ్య సందడి .. హిందీ స్పీచ్ , తమన్‌తో సరదా
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!