Devara | టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో ఒకటి దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్లో రోల్లో నటిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన టీం.. ఫియర్, చుట్టమల్లె సాంగ్స్ లాంచ్ చేయగా నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతున్నాయి. తాజాగా కొత్త లుక్ షేర్ చేశారు మేకర్స్. భయం ముఖ చిత్రాలు.. అంటూ తారక్ కొంచెం నవ్వు.. మరికొంచెం రౌద్రరూపంలో కనిపిస్తూ గూస్బంప్స్ తెప్పిస్తున్నాడు. ఇప్పుడీ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఒక నెలలో బిగ్ స్క్రీన్‌పైకి దేవర రాక.. ఆ అనుభూతి ప్రపంచాన్ని కదిలిస్తుంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో దేవర మ్యాడ్నెస్ని అనుభవిద్దాం.. అంటూ రిలీజ్ చేసిన లుక్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవరతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
𝐓𝐇𝐄 𝐅𝐀𝐂𝐄𝐒 𝐎𝐅 𝐅𝐄𝐀𝐑 ‼️
In a month, his arrival will stir up the world with an unmissable big screen experience 🔥🔥
Let’s experience his Majestic Madness in theaters on September 27th ❤️🔥#Devara #DevaraOnSep27th
Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan… pic.twitter.com/UC7ojtMHJo
— NTR Arts (@NTRArtsOfficial) August 27, 2024
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Priyadarshi | సారంగపాణి జాతకం సెట్స్‌లో కేక్ కట్ చేసిన ప్రియదర్శి.. స్పెషల్ ఇదే
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?
Saripodhaa Sanivaaram | సరిపోదా శనివారం ప్రీ సేల్స్.. నాని తన రికార్డు తానే బ్రేక్ చేస్తాడా..?
చుట్టమల్లె సాంగ్..