Call Me Bae | బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ గురించి తెలియనివారు అంటూ ఉండరు. దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి షారుఖ్‌తో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాడు. అనంతరం ధర్మ ప్రోడక్షన్స్ పేరిటా నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసి ఎంతోమంది బాలీవుడ్ నటులను లాంచ్ చేశాడు. ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, అనన్య పాండే సహా స్టార్ నటులను కరణే లాంచ్ చేశాడు. అయితే తాజాగా కరణ్ జోహార్ అనన్య పాండేను మరోసారి లాంచ్ చేయబోతున్నాడు.
అనన్య ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కరణ్ జోహార్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అనన్య పాండే ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘కాల్ మీ బే’ (Call Me Bae). కరణ్ జోహార్ నిర్మాతగా వస్తున్న ఈ వెబ్ సిరీస్ గ్లింప్స్‌ను ప్రైమ్ వీడియో సోషల్ మీడియా వేదికగా నేడు విడుదల చేసింది. ఇక ఈ వీడియోలో అనన్య పాండేను రీ లాంచ్ చేయబోతున్నట్లు ఫన్నీగా ఒక వీడియో రూపంలో కరణ్ తెలిపాడు. కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సిరీస్‌ను సెప్టెంబర్ 06 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Also Read..