Bhatti Vikramarka | కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి గృహ జ్యోతి పథకం వర్తింప చేయండి : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
Bhatti Vikramarka | హైదరాబాద్ : విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్లో ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెన్ కో నిర్వహించే విద్యుత్తు ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను ఈ కమిటీ క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేసి పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా జెన్ కో సీఎండీ నిర్ణయం తీసుకుని విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం రాకుండా చూడాల్సిందిగా ఆదేశించారు.
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ -1లో జనరేటర్ ట్రాన్స్ ఫార్మార్ మరమ్మతులు చేయాలా? …లేక కొత్తది కోనుగోలు చేయాలా? అనే అంశాన్ని టెక్నికల్ కమిటీకి పరిశీలిస్తోందని తెలిపారు. డిసెంబర్ 2023కు ముందు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నివేదించాలని ఈ సందర్భంగా అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయాలను అమలు చేసే సమయంలో సీఎండీలు తప్పనిసరిగా ఎనర్జీ సెక్రెటరీని సంప్రదించాలని సూచించారు. జల విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతేవెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఇందులో ఎలాంటి ఆలసత్వం వహించవద్దని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం గురించి ఆరా తీశారు. గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి గృహ జ్యోతి పథకాన్ని వారికి వర్తింపచేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 227 సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రక్రియ మొదలైందని చెప్పారు. అందులో 113 సబ్ స్టేషన్లకు స్థల సమస్య లేదని మిగతా వాటికి స్థలాలు కలెక్టర్లు కేటాయించాల్సి ఉందని చెప్పారు.
కాళేశ్వరం, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉపయోగిస్తున్నారు? అందుకు ఎంత మేర ఖర్చు అవుతోందో మొత్తం వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టంగా చెప్పారు. ఈ సమస్య సమావేశంలో ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

