Naga Chaitanya | నాగచైతన్య అలా చేయడం కరెక్టేనా?
2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అంటే పెళ్లైనా నాలుగేళ్లకే విడాకులు తీసుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు.
ఏ మాయాచేసావే చిత్రంతో పరిచయమైన నాగచైతన్య, సమంత జంట.. మేడ్ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంది. వాళ్ల స్నేహాం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ కాస్త పెద్దల అంగీకారంతో పెళ్లిగా కొత్తరూపును తీసుకుంది. దాదాపు ఏడేళ్ల ప్రేమను ఒక్కటిగా చేసుకున్నారు. ప్రేమించుకోవడానికి ఏడేళ్లు పట్టిన ఈ జంటకు పెళ్లి తరువాత పట్టుమని ఏడేళ్లు కూడా కాపురం చేయలేకపోయారు. 2010లో ఏమాయాచేసావే చిత్రం షూటింగ్ సమయంలో మొదలైన వీళ్ల ప్రేమ 2017లో ఏడేళ్ల తరువాత ఒక్కటయ్యారు.
2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అంటే పెళ్లైనా నాలుగేళ్లకే విడాకులు తీసుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. అయితే వీరి డైవర్స్‌కు రకరకాల కారణాల అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. వివాహం తరువాత సమంత నటించడం అక్కినేని కుటుంబంలో ఇష్టం లేదని అయితే సమంత వారి నిర్ణయాన్ని కాదని సినిమాల్లో యాక్ట్ చేయడంతో మనస్పర్థలు మొదలయ్యాయి. ఇక ఫ్యామలీమ్యాన్ వెబ్‌సీరిస్‌లో చేయడం ఇష్టం లేని అక్కినేని నాగచైతన్య సమంతకు గొడవలు మరింత పెరిగాయని అప్పట్లో వార్తలు వినిపించాయి.
అంతేకాదు ఈ వెబ్ సీరిస్ వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కూడా కొంత మంది అన్నారు. అయితే నాగచైతన్యతో విడిపోయిన తరువాత సమంత సినిమాల్లో బిజీగానే వుంది. కానీ ఇంతలోనే ఆమె మయోసైటీస్ అనే వ్యాధిబారిన పడటంతో అందరు సమంత తొందరగా కోలుకోవాలని కోరుకున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి కనీసం ఎవరూ సమంత ఆరోగ్యంపై పట్టించుకోకపోవడం పలు విమర్శలకు కూడా దారితీసింది.
కనీసం సహ ఆర్టిస్టుగానైనా సమంతకు, నాగచైతన్య ధైర్యం చెప్పొచ్చు కదా..అని విమర్శించిన వాళ్లు కూడా వున్నారు. అయితే తాజాగా నాగచైతన్య, శోభిత దూళిపాళను వివాహం చేసుకోబోతుండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ఎంగేజ్మెంట్తో ఆ వార్తను నిజం చేశారు. గత కొంతకాలంగా వీరి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై అక్కినేని ఫ్యామిలీ స్పందించలేదు.
ఇక ఇప్పుడు నాగచైతన్య, శోబిత ధూళిపాళ పెళ్లి గురించి అధికారికంగా ధృవీకరించడంతో.. నాగచైతన్య ఇలా చేయడం కరెక్ట్ కాదని కొంత మంది అంటున్నారు. అనారోగ్యంతో సతమతమవుతున్న సమంతను అలా బాధపెట్టడం కరెక్ట్ కాదని అంటుంటే. మరికొంత మంది మాత్రం నాగచైతన్య తప్పేమీ లేదు.. విడాకుల తరువాత ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే అంటున్నారు..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

