THE PARADISE | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తోన్న ది ప్యారడైజ్ (THE PARADISE). Nani Odela 2 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు.
తాజాగా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేసింది. మార్చి 3న ది ప్యారడైజ్ నుంచి RAW STATEMENT.. వచ్చే వారం వైల్డ్ రైడ్ ఉండబోతుంది అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ నాని కాంపౌండ్ నుంచి ఎలాంటి ప్రకటన ఉండబోతుందోనంటూ తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్, అభిమానులు. ఇప్పటికే నాని టీం హింస, రక్తపాతం, తుపాకులు. గ్లోరీ, ఒక మనిషి.. అంటూ షేర్ చేసిన లుక్ నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఫిబ్రవరి 24న ది ప్యారడైజ్ స్నీక్ పీక్‌ను లాంచ్ చేయబోతున్నారట. బ్లాక్ బస్టర్ దసరా కాంబో అవడం, నాని-అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Team #TheParadise wishes Natural Star @NameisNani a very Happy Birthday ❤🔥
The ‘RAW STATEMENT’ of THE PARADISE on 3rd March, 2025.
A WILD RIDE awaits next week 🔥#TheParadise #HappyBirthdayNani@odela_srikanth @anirudhofficial @sudhakarcheruk5 @SLVCinemasOffl… pic.twitter.com/gBkS8yGVey
— BA Raju’s Team (@baraju_SuperHit) February 24, 2025
Dragon | డ్రాగన్ అందమైన సినిమా.. డైరెక్టర్ శంకర్ ట్వీట్‌కు ప్రదీప్ రంగనాథన్ రియాక్షన్ ఇదే
Toxic The Movie | ఒకేసారి రెండు భాషల్లో.. తొలి భారతీయ సినిమాగా యశ్ టాక్సిక్ అరుదైన ఫీట్..!