Dhamaka Trailer Released | మాస్ మహారాజా రవితేజ, పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు తెరకెక్కిన సినిమా ఈ నెల 23న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఒకవైపు లవ్ స్టోరీ.. మరో వైపు యాక్షన్ స్టోరీ కలగలిపి.. టైటిల్‌కు తగ్గట్టు డబుల్ ఇంపాక్ట్ చూపించేలా కనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే చాలా రోజుల తర్వాత రవితేజ మార్క్ ఫన్, మాస్ యాక్షన్ తప్పగా ఉంటుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
నెలరోజుల్లో ఉద్యోగం కావాల్సిన నిరుద్యోగి ( రవితేజ) ఒకరు అయితే.. వెయ్యి కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యం పెట్టుకున్న బిలియనీర్ ( రవితేజ ) మరొకరు. వీరిద్దరికీ మధ్య సంబంధమేంటి అన్న కథతో ధమాకా సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తుంది.వెనకున్న వాళ్లను చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్.. వెనక ఎవరూ లేకపోయినా ముందుకురావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసినవాడిని అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా రవితేజ నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను త్రినాథరావు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. మరి ధమాకా సినిమాతో మాస్ మహారాజ్ మళ్లీ హిట్ కొడుతాడేమో చూడాలి.
Pawan Kalyan | విజయ్ కోసం వస్తున్న పవన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Varalaxmi Sarathkumar | వరలక్ష్మి శరత్‌కుమార్ డబ్బింగ్ షురూ.. ఏ సినిమాకో తెలుసా..?