టాలీవుడ్ క్రేజీ యాక్టర్ రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా ప్రాజెక్టుల్లో ఒకటి ధమాకా (Dhamaka). త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్లి సందD ఫేం శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై కొత్త అప్ డేట్ తెరపైకి వచ్చింది. యాక్షన్ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ధమాకా కొత్త షెడ్యూల్ త్వరలోనే హైదరాబాద్లో షురూ కానుంది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 25 నుంచి న్యూ షెడ్యూల్ మొదలుకానుంది.
ప్రసన్నకుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ,స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొల్లు సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ధమాకాలో గూస్ బంప్స్ తెప్పించే ఫైట్సీన్లను ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ (Ram Lakshman) నేతృత్వంలో షూట్ చేశారు.
రవితేజ దీంతోపాటు శరత్ మండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ , సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసుర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావు కూడా చేస్తున్నాడు. క్రాక్ సినిమా అందించిన సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాపీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.