Neninthe | బాక్సాఫీస్ వద్ద హిట్, ఫ్లాప్ టాక్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సినిమాలు కొన్నుంటాయి. అందులో టాప్‌లో ఉంటుంది రవితేజ (Ravi Teja) నటించిన నేనింతే (Neninthe). సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఎలాంటి కష్టాలు పడాల్సి వస్తుందో తనదైన స్టైల్లో చూపించాడు పూరీ జగన్నాధ్ ( Puri Jagannadh).. రవితేజ, శియా గౌతమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం 2008లో విడుదలైంది.
కమర్షియల్‌గా సక్సెస్ అందుకోకున్నా కంటెంట్ పరంగా చాలా మందికి కనెక్ట్ అవుతుంది నేనింతే. ఈ సినిమాను మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూడాలనుకునే వారి కోసం క్రేజీ వార్త వచ్చేసింది. నేనింతే రవితేజ పుట్టినరోజు సందర్భంగా రిపబ్లిక్ డే కానుకగా 2025 జనవరి 26 రీరిలీజ్ కానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి మరి.
ఈ చిత్రంలో షాయాజీ షిండే, బ్రహ్మానందం, సుబ్బరాజు, ఎంఎస్ నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు.
.@RaviTeja_offl’s #Neninthe re releasing on Jan 26th on the occasion of his birthday. #RaviTeja pic.twitter.com/ohC6ajeKWr
— Suresh PRO (@SureshPRO_) December 24, 2024
Max Trailer | ప్రతీ పకోడిగాడు సమాజ సేవకుడే.. స్టన్నింగ్‌గా కిచ్చా సుదీప్ మాక్స్ ట్రైలర్
Bollywood 2024 | బాలీవుడ్‌కు కలిసి వచ్చిన 2024.. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్ హిందీ సినిమాలివే..!
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్