Ravi Teja | మాస్ జాతర సినిమాతో మూవీ లవర్స్‌కు పక్కా వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడు టాలీవుడ్ యాక్టర్ రవితేజ. శుక్రవారం మాస్ జాతర పెయిడ్ ప్రీమియర్ వేయనున్నారు. ఈ చిత్రంతోపాటు కిశోర్ తిరుమల దర్శకత్వంలో కూడా ఆర్టీ 76 ప్రాజెక్టును చేస్తున్నాడు. ఈ మూవీ 2026 సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతుంది. కాగా ఈ రెండు సినిమాలు విడుదల కాకముందే రవితేజ కొత్త మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలింనగర్లో రౌండప్ చేస్తోంది.
జాతి రత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలతో సూపర్ ఫేం సంపాదించాడు యంగ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న అనగనగా ఒక రోజు 2026 సంక్రాంతికి విడుదల కానుంది. కాగా ఈ ఇద్దరు సంక్రాంతి హీరోలు కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. ధమాకా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ రవితేజ, నవీన్ పొలిశెట్టి కోసం ఓ కథను సిద్దం చేసి వారికి వినిపించగా.. ఇద్దరూ స్క్రిప్ట్‌కు బాగా కనెక్ట్ అయ్యారని ఇన్సైడ్ టాక్. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా సామి రంగా, నేను లోకల్, దాస్ కా ధమ్కీతోపాటు పలు చిత్రాలకు డైలాగ్స్ అందించాడు ప్రసన్న కుమార్ బెజవాడ.
రవితేజ, నవీన్ పొలిశెట్టిలో కామిక్ టైమింగ్ విషయానికొస్తే ఎవరి స్టైల్ వారిదే. మరి అంతా అనుకున్నట్టు కుదిరితే రవితేజ, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడం పక్కా అని చెప్పొచ్చు. మరి ఈ క్రేజీ కాంబోపై రానున్న రోజుల్లో అధికారిక ప్రకటన ఏమైనా వస్తుందనేది చూడాలి. మరి ఈ ఇద్దరిని డైరెక్ట్ చేసేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
Nagadurg Debut | ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ!
The Family Man S3 | ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!