Ravi Teja | టాలీవుడ్ యాక్టర్ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులు, ఫాలోవర్లను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. భాను బోగవరపు డైరెక్షన్లో నటిస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది. రవితేజ మరోవైపు కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆర్టీ 76 ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టగా.. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలు విడుదల కాకముందే రవితేజకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
రవితేజ ఈ సారి చిరంజీవి డైరెక్టర్‌తో సినిమా చేసే ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ అతడెవరనే కదా మీ డౌటు. బింబిసారతో సూపర్ హిట్ అందుకుని ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర తెరకెక్కిస్తున్న వశిష్ఠ మల్లిడి. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఇటీవలే రవితేజకు ఓ ఐడియా చెప్పాడని వార్తలు వస్తుండగా.. మరి రాబోయే రోజుల్లో ఈ క్రేజీ కాంబోలో సినిమా ఒకే అవుతుందా..? అనేది ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే రవితేజ, నవీన్ పొలిశెట్టి కాంబోలో సినిమా వస్తుందని.. పాపులర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ ఇద్దరి కోసం ఓ కథ రెడీ చేశాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి వశిష్ఠ డైరెక్ట్ చేయబోయేది ఈ ప్రాజెక్ట్నేనా..? లేదంటే సెఫరేట్ సినిమా ఉండబోతుందా..? అనేది తెలియాల్సి ఉంది.

Bhoomi Shetty | ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Mahesh Babu | బాహుబలి రీరిలీజ్‌తో రాజమౌళి బిజీ బిజీ.. ఈ గ్యాప్‌ని మహేష్ భలే వాడేస్తున్నాడుగా..!