రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్జాతర’ ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. బ్యాలెన్స్‌గా ఉన్న పాటను తెరకెక్కించారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తొలుత ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. తాజా సమాచారం ప్రకారం దసరా బరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని తెలుస్తున్నది. అంటే అక్టోబర్‌లో మొదటివారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.
రవితేజ శైలి మాస్ అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందించారు. అయితే ఈ సినిమా విడుదల విషయమై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.