Ravi Teja | మాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. పాన్ ఇండియా స్టార్ డమ్ కొట్టేసిన అతికొద్ది మంది యాక్టర్లలో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ఒకడు. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఫహద్ ఫాసిల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ఆవేశం.
గ్యాంగ్ స్టర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పుడీ సినిమా తెలుగులో కూడా రాబోతుందా..? తాజా కథనాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. టాలీవుడ్ యాక్టర్ రవితేజ ఆవేశం తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
ఈ కథ రవితేజ మ్యానరిజానికి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అయితే మరి రవితేజ హీరోగా నటిస్తాడా..? లేదంటే హోం బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లో తెరకెక్కించి నిర్మాతగానే వ్యవహరిస్తాడా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వార్తలపై రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఫహద్ ఫాసిల్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్ డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానుంది. రవితేజ ప్రస్తుతం ఆర్టీ 75 ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు.
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్