Bhartha Mahasayulaku Wignyapthi | టాలీవుడ్ యాక్టర్ రవితేజ ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. RT76గా వస్తోన్న ఈ చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే నయా టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, ఖిలాడి ఫేం డింపుల్ హయతి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ Bella Bella సాంగ్ విడుదల చేయగా మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సెకండ్ సింగిల్ అద్దం ముందు అప్డేట్ అందించారు.
రవితేజ, డింపుల్ హయతి కాంబోలో రానున్న ఈ సాంగ్ ప్రోమోను డిసెంబర్ 10న సాయంత్రం 6:03 గంటలకు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. రవితేజ, డింపుల్ హయతి సూపర్ కూల్ ట్రాక్‌తో సాంగ్ విజువల్స్ ఉండబోతున్నట్టు తాజా లుక్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పక్కా ఫ్యామిలీ టచ్‌తో రవితేజ సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది.
టైటిల్ గ్లింప్స్‌లో భక్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇవాళ 10 : 30 నిమిషాలకు స్వామి వారి కళ్యాణం. అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందంటూ.. పంతులు వాయిస్ ఓవర్‌తో సాగే మాటలతో షురూ అయింది గ్లింప్స్. అనంతరం ఈ అనౌన్స్మెంట్ మనలో చాలా మంది చాలా సార్లు వినుంటాం. ఇప్పుడు నాకిది ఎందుకు గుర్తొచ్చిందంటే నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, జెమినీ, చాట్ జీపీటీ ఇలా అన్నింటిని అడిగాను. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా అయోమయానికి గురిచేశాయి అంటూ రవితేజ వాయస్ ఓవర్‌తో సాగుతున్న వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
Wignyapthi 3 : #BharthaMahasayulakuWignyapthi second single #AddhamMundhu promo out today at 6:03 PM✨
Full Song Out on 10th Dec ❤️
A #BheemsCeciroleo musical 🎼#BMW in Cinemas Sankranthi 2026 🥳@RaviTeja_offl #RaviTeja pic.twitter.com/8rWtXHGQNb
— BA Raju’s Team (@baraju_SuperHit) December 8, 2025
Ajay Bhupati | అజయ్ భూపతి – జయకృష్ణ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్… క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
OTT Movies | అఖండ2 సైడ్ ఇవ్వడంతో దూసుకొచ్చిన చిన్న సినిమాలు.. ఓటీటీలోను సందడే సందడి
Salman Khan | బిగ్ బాస్ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సల్లూభాయ్.. కారణం ఏంటంటే..!