Ravi Mohan | చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ప్రముఖ తమిళ స్టార్ యాక్టర్ రవి మోహన్ (Ravi Mohan). నాని నటించిన జెండాపై కపిరాజు సినిమాలో అతిథి పాత్రలో మెరిశాడు. తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు రవిమోహన్. ఈ క్రేజీ నటుడు కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. రవి మోహన్ కొత్త చిత్రానికి Bro Code అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీ సర్కిల్ సమాచారం.
వడక్కుపట్టి రామస్వామి ఫేం కార్తీక్ యోగి ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. కాగా ఈ చిత్రంలో తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్జే సూర్య పాత్రలు నెగెటివ్ షేడ్స్‌లో ఉంటాయని తెలిసిందే. అయితే ఎస్జే సూర్య ఈ సారి మాత్రం పాజిటివ్ రోల్లో కనిపించబోతున్నాడట.
అంతేకాదు ఈ మూవీనీ రవిమోహన్ హోం బ్యానర్ రవిమోహన్ స్టూడియోస్‌లో తెరకెక్కుతోంది. ఈ మూవీతో రవిమోహన్ నిర్మాతగా కూడా ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాదు ఈ చిత్రంలో కథానుగుణంగా నలుగురు హీరోయిన్లు ఉండబోతున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు యానిమల్, అర్జున్ రెడ్డి సినిమాలకు పనిచేసిన హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ కంపోజర్‌గా వ్యవహరిస్తున్నాడని ఇన్సైడ్ టాక్. మిడ్ సెప్టెంబర్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
Buzz is that #RaviMohan’s next is titled #BROcode 🔥 An action-comedy directed by Karthik Yogi, with S.J. Suryah in a key role! The project will be produced under Ravi Mohan Studios, the actor’s newly launched banner 🎬💥@iam_RaviMohan @karthikyogidir @iam_SJSuryah#BROcodeMovie… pic.twitter.com/agvWlBHFkx
— SIIMA (@siima) June 9, 2025
Tere Ishk Mein | ఎయిర్‌ఫోర్స్ అధికారిగా ధనుష్.. వైరలవుతున్న కొత్త సినిమా లుక్
Samantha | దర్శకుడు రాజ్ నిడుమోరుతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లిన సమంత..?
Aamani | ఆ పని తప్పక చేయాల్సిందే.. తన వీక్నెస్ బయటపెట్టిన నటి ఆమని