Samantha | ప్రముఖ స్టార్ నటి సమంత దుబాయ్ వెకేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఒక జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్లో పాల్గోనేందుకు అక్కడికి వెళ్లిన సామ్.. గత కొన్ని రోజులుగా అరబ్ కంట్రీలో విహరిస్తోంది. అక్కడి అందమైన లొకేషన్స్‌లో ఫొటోలకు ఫోజులిస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. తాజాగా అబుదాబి (Abu Dhabi)లో తన వెకేషన్‌కు సంబంధించిన చిత్రాలను సమంత ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సమంత తన రూమర్ బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో దుబాయ్ వెకేషన్‌కు వెళ్లిందంటూ చర్చించుకుంటున్నారు. సమంత షేర్ చేసిన ఓ ఫొటోలో సన్‌గ్లాసెస్ రిఫ్లెక్షన్లో రాజ్ నిడిమోరు కనిపిస్తున్నట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆయనే సమంత ఫొటోలు తీశారంటూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు మరో ఫొటోలో సమంత ఓ వ్యక్తితో కలిసి కనిపించింది. అయితే, ఆ వ్యక్తి ఫేస్ మాత్రం కనిపించలేదు. అక్కడున్నది రాజ్ అనే నెటిజన్లు భావిస్తున్నారు.
కాగా, సమంత (Samantha) రెండో పెళ్లికి సిద్ధమైనట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో ఆమె ప్రేమలో పడిందని, గత కొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఇక నెట్టింట ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే విపరీతంగా చర్చ నడుస్తోంది. వీరిద్దరూ అతి తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్‌మీడియా మొత్తం కోడైకూస్తోంది.
పలు కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి వెళ్తుండటంతో వారిద్దరు రిలేషన్లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’ సక్సెస్‌లో భాగంగా రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలను సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్‌గా చేయగా, అందులో ఆయనకి కాస్త క్లోజ్‌గా ఉన్నట్టు కనిపించింది. దీంతో డేటింగ్ వార్తలు నిజమేనంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు రాజ్, సమంతలకి సంబంధించి వస్తున్న వార్తలని సమంత మేనేజర్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రూమర్స్‌పై (Dating Rumours) సమంతగానీ, రాజ్ గానీ ప్రత్యక్షంగా స్పందించలేదు.
Also Read..
Samantha | పాత గుర్తులను చెరిపేస్తున్న సమంత.. తాజా వీడియోలో ఆ టాటూ మాయం..?
Nayanthara | నా మనసు ఎప్పుడూ కోరుకునే ప్రేమవు నువ్వు.. భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన నయన్