Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన సామ్.. ఆ తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడింది. దాదాపు పదేళ్ల ప్రేమాయణం తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటైంది ఈ జంట. అయితే, పెళ్లైన నాలుగేళ్లకే వీరు విడిపోయి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.
నాగ చైతన్యతో విడాకుల అనంతరం పలు అనారోగ్య కారణాలతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. వరుస పెట్టి సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. అదే సమయంలో తన పాత జ్ఞాపకాలను కూడా ఒక్కొక్కటిగా చెరిపేస్తోంది. ‘నథింగ్ టు హైడ్’ అంటూ సామ్ షేర్ చేసిన తాజా వీడియో ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది.
ఆమె తొలి సినిమా ‘ఏ మాయ చేశావే’ పేరులోని మొదటి అక్షరాలు YMCను మెడ వెనుక భాగంలో పచ్చబొట్టుగా వేయించుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజా వీడియోలో ఆ టాటూ కనిపించలేదు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ‘YMC.. టాటూను సమంత తొలగించేశారా?’ అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలా జరిగి ఉండకపోవచ్చని.. మేకప్‌తో అది కనిపించకుండా కవర్ చేసి ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ టాటూ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
టాటూలు వేయించుకోకండి..
సమంత తన శరీరంపై మూడు టాటూలు వేయించుకున్న విషయం తెలిసిందే. వీటిలో రెండు ఆమె మాజీ భర్త నాగ చైతన్యకు సంబంధించినవి కావడం గమనార్హం. ఇక విడాకుల అనంతరం టాటూల విషయంలో సామ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన అభిమానులకు కీలక విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మీరు ఎప్పటికీ టాటూలు వేయించుకోవద్దు (Never, ever, get a tattoo) అని సలహా ఇచ్చారు.
సామ్ త తొలి సినిమా ‘ఏ మాయ చేశావే’ పేరులోని మొదటి అక్షరాలు YMCని మెడ వెనుక భాగంలో పచ్చబొట్టుగా వేయించుకున్న విషయం తెలిసిందే. ఇక తన మాజీ భర్త నాగ చైతన్య ముద్దు పేరు ‘Chay’ టాటూని ఆమె పక్కటెముకల మీద వేయించుకున్నారు. ఆమె మణికట్టుపై రెండు బాణాల గుర్తు కూడా ఉంటుంది. దీని అర్థం “మీ సొంత వాస్తవికతను సృష్టించుకోండి” (Create your own reality). ఇదే టాటూ నాగ చైతన్యకు కూడా ఉంది.
Also Read..
“Samantha Ruth Prabhu | దుబాయ్ ఈవెంట్లో సమంత.. గోల్డెన్ శారీలో మెరిసిపోయిన నటి.. ఫొటోలు వైరల్”
“నిర్మాత కష్టాలేమిటో తెలిసొచ్చాయి!”
“Samantha Ruth Prabhu | టాటూలు వేయించుకోకండి.. అభిమానులకు సమంత కీలక సలహా”