‘నటిగా 15 ఏళ్ల కెరీర్ పూర్తయింది. ఈ ప్రయాణంలో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నా. అయినా ఇంకా ఏదో చేయాలనే తపన నన్ను వెంటాడేది. ఇండస్ట్రీలో ఇంత అనుభవం ఉంది కాదా అనే ధీమాతో నిర్మాతగా మారాను’ అని చెప్పారు అగ్ర కథానాయిక సమంత. ట్రా లా లా పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆమె తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ‘శుభం’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం సమంత పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు…