Nayanthara | చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) జంట ఒకటి. సుమారు ఏడేండ్లపాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా, నేడు వీళ్ల మూడో వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్‌కు నయన్ సోషల్ మీడియా ద్వారా స్పెషల్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ఈ మేరకు క్యూట్ ఫొటోలను కూడా పంచుకున్నారు.
‘ఒకరిపైఒకరు ఇంతగా ఎలా ప్రేమ చూపుతారనేదానికి ఎప్పటికీ సమాధానం దొరకదు. నీ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. నా మనసు ఎప్పుడూ కోరుకునే ప్రేమవు నువ్వు. ఇద్దరిగా ప్రారంభమైన మన ప్రయాణం నలుగురుగా మారింది. ఇంతకు మించి కోరుకోవడానికి ఏముంది. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు నాకు చూపించావు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా జీవితభాగస్వామికి పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ నయన్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు క్యూట్ ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు నయన్-విఘ్నేశ్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో 2022 జూన్ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan) అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఈ జంట ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
Also Read..
Kubera OTT Deal | విడుదల ఆలస్యమైతే రూ.10 కోట్లు కట్.. ‘కుబేర’పై ప్రైమ్ వీడియో షరతు
PV Sindhu | బికినీలో పీవీ సింధు.. బ్యాడ్మింటన్ స్టార్ ఫొటోలు వైరల్
Kamal Hassan | కమల్ హాసన్ ఖాతాలో మరో డిజాస్టర్.. మణిరత్నం చాప్టర్ కూడా క్లోజ్ అయినట్టేనా..!