Aamani | తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఆమని. టాలీవుడ్లో హీరోయిన్ గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ చీరకట్టులో.. సంప్రదాయ లుక్ లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమని సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లిగా.. అత్తగా పాత్రలు చేస్తూ బిజీగా ఉంటున్నారు.మరోవైపు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమని ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ అనే బుల్లితెర సీరియల్లో నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్రకు మంచి ఆదరణ లభించింది.
మొత్తానికి ఆమని సెకండ్ ఇన్నింగ్స్లోను దూసుకుపోతుంది. సినిమాలతో పాటు టీవీ షోలు, సీరియల్స్, ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉంటుంది. అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఆ పని తప్పక చేయాల్సిందేనని ఆమని అంటుంది. అది తన వీక్నెస్ అని కూడా పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే లేస్తానని.. నిద్రలేచిన వెంటనే స్నానం చేసి పూజ చేయడం తాను మొదట చేసే పని అని ఆమని పేర్కొంది. అయితే తాను పూజ చేయకుండా ఎక్కడికీ వెళ్లనని.. ఒకవేళ పూజ చేయకపోతే ఆ రోజంతా తన మనసు కలత చెందినట్టు ఉంటుందని స్పష్టం చేసింది. లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవడం, ఆ తర్వాత యోగా చేయడం దైనందిన చర్య అని ఆమని పేర్కొంది.
సినిమాలతో పాటు టీవీ షోలు, సీరియల్స్, ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉన్నా కూడా.. ప్రతి రోజు ఉదయం ఆమని పూజ చేసుకోవడం చాలా మంచి విషయమని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, కెరీర్ మంచి ఫాంలో ఉన్న ఆమని తమిళ సినిమా నిర్మాత ఖాజా మోహియుద్దీన్ వివాహం చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉన్నారు. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తాను ప్రస్తుతం తన భర్త నుండి దూరంగా ఉంటుంది. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని… ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయామని అన్నారు. విడిపోయినా ఇప్పటికీ ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటున్నామని.. పిల్లలు మాత్రం తన వద్దే ఉంటున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.