Dhanush Tere Ishk Mein | తమిళ నటుడు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్‌తో విడిపోయిన అనంతరం తన ఫోకస్నంతా ప్రస్తుతం సినిమాలపైనే పెడుతున్న విషయం తెలిసిందే. గతేడాది రెండు సినిమాలను దర్శకత్వం చేయడంతో పాటు విడుదల చేసి హిట్లు కూడా అందుకున్నాడు. ఇందులో రాయన్ సినిమా మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది.
అయితే ధనుష్ నటించిన కుబేర సినిమా ఈ నెల జూన్ 20న విడుదల కానుంది. మరోవైపు అతడి దర్శకత్వంలో రానున్న (ఇడ్లీ కడై)ఇడ్లీకొట్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలు లైన్లో ఉండగానే మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను కూడా కంప్లీట్ చేస్తున్నాడు ధనుష్. తనకు బాలీవుడ్లో రాన్‌జానా వంటి సూపర్ హిట్‌ని ఇచ్చిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో ధనుష్ ఒక సినిమా చేస్తున్నాడు. ‘తేరే ఇష్క్ మే’ అంటూ రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం.
Read More