Swayambhu | టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ (Nikhil) నటిస్తోన్న తాజా చిత్రం స్వయంభు (SWAYAMBHU). నిఖిల్ తొలి పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న Nikhil 20లో మలయాళ బ్యూటీ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కేజీఎఫ్ చిత్రానికి అదిరిపోయే బీజీఎం అందించిన రవిబస్రూర్ స్వయంభు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసిందే. కాగా చాలా రోజుల తర్వాత స్వయంభు అప్డేట్ స్టిల్ రూపంలో బయటకు వచ్చింది.
ప్రస్తుతం స్వయంభు మ్యూజిక్ సెషన్స్ కొనసాగుతున్నాయి. రవి బస్రూర్ పాటల రికార్డింగ్ సెషన్లో ఉన్నాడు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి, రవి బస్రూర్ కలిసి ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే కార్తికేయ ప్రాంఛైజీతో నార్త్‌లో మంచి ఫేం సంపాదించిన నిఖిల్‌కు రవిబస్రూర్ బాణీలు మరింత ఇమేజ్ను తెచ్చిపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయంటున్నారు సినీ జనాలు.
ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నట్టు ఇప్పటివరు విడుదల చేసిన పోస్టర్లు చెబుతున్నాయి.
Music sessions of #Swayambhu happening in full swing 💥
Director @krishbharat20, the sensational music director @RaviBasrur and the skilled lyricist @ramjowrites are finalizing on the songs of #Swayambhu 💥💥
A #RaviBasrur‘s epic album loading ❤️🔥❤️🔥 pic.twitter.com/x0Ix7OpeMj
— Suresh PRO (@SureshPRO_) September 19, 2024
Jani Master | జానీ మాస్టర్ కోసం గాలింపు.. బాధితురాలి ఇంటికి పోలీసులు..!
Jani Master | ఇది లవ్ జిహాద్ కేసు.. జానీ మాస్టర్ కేసుపై కరాటే కళ్యాణి
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?