Raveena Tandon | “పద్మ పురస్కారం నా అదృష్టం. నా శ్రమకు గుర్తింపు. ఒక మహిళగా నా బాధ్యత కుటుంబానికే పరిమితం అనుకోను నేను. సమాజమూ నా కుటుంబానికి కొనసాగింపే. నా వెబ్ సిరీస్ ‘అరణ్యక్’లో సామాజిక సందేశం ఇమిడి ఉంది. కుటుంబ బాధ్యతలకు న్యాయం చేస్తూనే, కెరీర్లో తననుతాను నిరూపించుకోవడానికి ప్రతి మహిళా ఎంత కష్టపడుతున్నదో ‘అరణ్యక్’లో చూపించాం. నేను ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటున్నా. ఇద్దరి వయసూ ఇరవై దాటింది. నా స్నేహితులైనా, బంధువులైనా వాళ్లే. పెద్దపెద్ద చదువులు, ఉద్యోగాలు.. వీటన్నిటికంటే ఉత్తమ పౌరులుగా, మనసున్న మనుషులుగా తీర్చిదిద్దాలన్నదే నా ఆరాటం.
సామాజిక మాధ్యమాలు అర్థంలేని కథనాలు అల్లిన ప్రతిసారీ నాకు బాధగా అనిపిస్తుంది. మంచి పని చేసినా.. రహస్యంగా చేయడమే మేలనిపిస్తుంది. లేదంటే ఫలానా పదవి కోసమో, పురస్కారం కోసమో ఇదంతా చేశానని అంటారు. జీవితంలో కష్టాలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని ధైర్యంగా స్వీకరించాలి. నా పిల్లలకు నేను చెప్పేది ఇదే” అంటూ ఓ తాజా ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించింది రవీనా టాండన్.