Aashiqui-3 | ‘ఆషికి-3’ హీరోయిన్గా సౌత్ స్టార్ నటి?
Aashiqui-3 Heroine | ‘భూల్ భూలైయా-2’ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న కార్తిక్ ఆర్యన్ తన నెక్స్ట్ సినిమా బాలీవుడ్ క్లాసిక్ 'ఆషికి' పార్ట్-3 చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన గ్లింప్స్‌కు విశేష స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
Aashiqui-3 Heroine | బాలీవుడ్ ప్రేమ కథల్లో ‘ఆషికి’ సిరీస్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. 1990లో విడుదలైన ‘ఆషికి’ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం 30లక్షల్లో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 5 కోట్ల కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమా పాటలైతే అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి. అలియా భట్ తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మించింది. కాగా దాదాపు 23ఏళ్ళ తర్వాత అదే నిర్మాణ సంస్థలో ‘ఆషికి-2’ తెరకెక్కింది. ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం వంద కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా పాటలకైతే సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. కాగా ఇటీవలే ఈ సిరీస్‌లో మూడో చిత్రం తెరకెక్కనున్నట్లు అఫిషియల్‌గా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
‘భూల్ భూలైయా-2’ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్న కార్తిక్ ఆర్యన్ ‘ఆషికి-3’లో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ‘మర్డర్’ ఫేం ఆనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేకర్స్ ప్రస్తుతం హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నారట. ఈ క్రమంలోనే ఇటీవలే కార్తిక్ ఆర్యన్‌తో ఓ యాడ్ షూట్ చేసిన రష్మికను హీరోయిన్గా ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని టీ సిరీస్- విశేష్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతమ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
Read Also:
Satya Dev | ‘పుష్ప’ నటుడితో సత్యదేవ్ మల్టీస్టారర్?
NBK107 | భారీ ధరకు బాలకృష్ణ ‘NBK107’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Thiru Movie | ఓటీటీలోకి ధనుష్ ‘తిరు’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ye Maaya Chesave Movie | ‘ఏమాయ చేశావే’ మూవీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

