తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. తాజాగా ఈ భామ బాలీవుడ్లో మరో బంపరాఫర్‌ను దక్కించుకుంది. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని హిందీలో ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు స న్నాహాలు చేస్తున్నారు.
ఇందులో షాహిద్‌కపూర్ కథానాయకుడిగా నటించనుండగా ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నను కథానాయికగా ఖరారు చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం రష్మిక మందన్న హిందీలో రణ్‌బీర్‌కపూర్ సరసన ‘యానిమల్’ చిత్రం లో నటిస్తున్నది. ఆగస్ట్ 11న ఈ చిత్రం విడుదలకానుంది.