Rashmika Mandanna | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు అంబాసిడర్‌గా అగ్ర కథానాయిక రష్మిక మందన్నను నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటించింది. ఈ సందర్భంగా రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేసింది. డీప్ ఫేక్ వీడియో వల్ల గతంలో తాను సైబర్ క్రైమ్ బారిన పడ్డానని, అందుకే దానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నానని రష్మిక మందన్న తన పోస్ట్‌లో పేర్కొంది.
‘సైబర్ క్రైమ్ గురించి అందరికీ అవగాహన కల్పించడానికి ఇదొక మంచి అవకాశం. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నన్ను ఎంచుకోవడం సంతోషంగా ఉంది. సైబర్ క్రైమ్ పట్ల అవగాహన పెంచడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. సైబర్ నేరస్థులు మనల్ని ఎటాక్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనం ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటూ వారి బారి నుంచి రక్షించుకోవాలి. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాను’ అని రష్మిక మందన్న తెలిపింది. గతంలో రష్మిక మందన్న డీఫ్ ఫేక్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియోపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఆ తర్వాత పలువురు సినీ తారలు డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతున్నది.