Mysaa | పుష్ప ప్రాంచైజీతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ డమ్ సంపాదించింది కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ భామ లీడ్ రోల్లో నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం మైసా. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
తాజా టాక్ ప్రకారం ఈ చిత్రానికి ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రాజెక్ట్‌కు పనిచేసిన ఆండీ లాంగ్ గ్యుయెన్ స్టంట్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. అంతేకాదు యాక్షన్ బ్లా్క్స్పై పనిచేసేందుకు ఇప్పటికే ఆండీ లాంగ్ గ్యుయెన్ టీం కేరళలో ల్యాండింగ్ కూడా అయినట్టు సమాచారం. షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుందని ఇన్సైడ్ టాక్.
ఈ మూవీలో పుష్ప 2 విలన్ తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. రష్మిక మందన్నా సినిమాలో తారక్ పొన్నప్ప నటించడం ఇది రెండోసారి. Rawindra Pulle మైసా సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ డెబ్యూ డైరెక్టర్ ఇటీవలే మైసా నుంచి రష్మిక మందన్నా అగ్రెసివ్ లుక్ విడుదల చేయగా.. గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని చెప్పకనే చెబుతోంది.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. శ్రీవల్లిగా డీగ్లామరస్ రోల్లో ఇరగదీసిన రష్మిక మందన్నాను మరి కొత్త దర్శకుడు మైసా సినిమాలో ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Ghattamaneni Family | ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం.. వారసత్వం నిలబెట్టేదెవరు?
Peddi | శ్రీలంకలో ఫుల్ స్వింగ్‌లో ‘పెద్ది’ షూటింగ్ .. ఆ లోకేషన్లో షూటింగ్ వెనక కారం ఏంటి?