Superstar Heirs | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఘట్టమనేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణతో మొదలైన ఈ వారసత్వాన్ని దివంగత నటుడు మహేశ్ బాబు అన్న రమేష్ బాబుతో పాటు, మహేశ్ బాబు, సుధీర్ బాబు, మంజుల వంటి రెండో తరం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మూడో తరం సినీ రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
తాజాగా మంజుల కుమార్తె.. మహేశ్ బాబు మేనకోడలు జాహ్నవి హీరోయిన్గా టాలీవుడ్లోకి పరిచయం కాబోతున్నట్లు మంజుల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం ఘట్టమనేని ఫ్యామిలీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎందుకంటే.. భవిష్యత్‌లో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచే ఆర డజన్ యువతరం వెండితెర మీదకి రాబోతుంది. ఇందులో మహేశ్ బాబు కుమారుడితో పాటు ఇతర నటీనటులు పిల్లలు ఉన్నారు. అయితే వారేవరు అనేది చూసుకుంటే.
మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని విషయానికి వస్తే.. గౌతమ్ ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. సినీ అకాడమీలో ట్రైనింగ్ పొందుతూ అరంగేట్రానికి సన్నద్ధమవుతున్నాడు. మహేశ్ బాబు అక్క మంజుల కుమార్తె జాహ్నవి త్వరలో హీరోయిన్గా పరిచయం కాబోతోంది. మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని త్వరలోనే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుండగా.. రమేశ్ బాబు కుమార్తె భారతి ఘట్టమనేని హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఇంకా వీరే కాకుండా మహేశ్ బాబు బావ.. నటుడు సుధీర్ బాబు పెద్ద కుమారుడు చరిత్తో పాటు చిన్న కుమారుడు దర్శన్ త్వరలోనే సినీ రంగంలోకి రాబోతున్నారు. మొదటి తరం సూపర్‌స్టార్, రెండో తరం ప్రిన్స్ స్థాయిలో రాణించగా, ఈ మూడో తరం వారసులు తమదైన ముద్ర వేసి ఘట్టమనేని ఫ్యామిలీ సినీ వారసత్వాన్ని ఏ స్థాయిలో నిలబెడతారో చూడాలి.

GhattamaneniFamily