Deepika Padukone | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కల్కి 2898 AD’ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అగ్ర నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పేరును ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రం చివరి క్రెడిట్స్ (End Credits) నుంచి మేకర్స్ తొలగించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె తప్పుకున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం సద్దుమణగక ముందే ఇప్పుడు ఓటీటీలో ఉన్న కల్కి ఫస్ట్ పార్ట్‌లో క్రెడిట్స్ నుంచి దీపికా పదుకొణె పేరును తొలగించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. దీపికా పేరును తొలగించడంపై దీపికా అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఒకవైపు పేరును తొలగించలేదంటూ పలువురు కామెంట్లు చేయడం మొదలుపెడుతున్నారు. కాగా ఈ వివాదంపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
#DeepikaPadukone‘s fans slam Kalki 2898 AD makers for allegedly removing actress’ name from credits.https://t.co/EP9K0oNEV0
— Filmfare (@filmfare) October 29, 2025