Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ‘ఉప్పెన’తో సెన్సేషన్ సృష్టించిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ క్రేజ్ సంపాదించుకుంది.తాజా సమాచారం ప్రకారం, ‘పెద్ది’ టీమ్ ప్రస్తుతం శ్రీలంకలో కీలకమైన షెడ్యూల్లో బిజీగా ఉంది. అక్కడ రామ్ చరణ్ – జాన్వీ కపూర్ జంటపై ఓ అందమైన పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, ఇది విజువల్‌గా, మ్యూజికల్‌గా గ్రాండ్ ట్రీట్‌గా మారబోతోందని ఫిల్మ్‌నగర్ టాక్. రామ్ చరణ్ కూడా ఇటీవల శ్రీలంక బయలుదేరుతుండగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.
ఇంతలో, శ్రీలంక లొకేషన్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సానా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కలిసి దిగిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫోటోల్లో ఇద్దరూ ఒక పాత రైల్వే ట్రాక్ టన్నెల్ ముందు నిలబడి ఉన్నారు. ఈ లొకేషన్ చూసి ఫ్యాన్స్‌లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇది కేవలం సాంగ్ కోసం మాత్రమేనా? లేక సినిమాలో కీలకమైన యాక్షన్ లేదా ఎమోషనల్ సీక్వెన్స్‌కు సంబంధించిందా? అని ముచ్చటించుకుంటున్నారు. ఆ టన్నెల్ బ్యాక్‌డ్రాప్ సినిమాకు ప్రత్యేకమైన భావోద్వేగ టచ్ ఇస్తుందని అంచనా.
రత్నవేలు వంటి టాప్ సినిమాటోగ్రాఫర్ ఈ ప్రాజెక్ట్‌లో ఉండటంతో, విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫ్యాన్స్ నమ్మకం. బుచ్చిబాబు, రత్నవేలు ఇద్దరి కాంబినేషన్ పిక్స్ ఆ అంచనాలను మరింత పెంచాయి. మొత్తానికి, ‘పెద్ది’ టీమ్ శ్రీలంకలో ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్‌ను మల్టిపుల్ లుక్స్‌లో చూడబోతున్నారని టాక్. 2026 మార్చి విడుదల లక్ష్యంగా సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రంతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరగడంఖాయం అంటున్నారు.